రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
గ్రామీణ ప్రాంతాల సమగ్ర ప్రగతికి,మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు.మెరుగైన రోడ్డు కనెక్టివిటీతోనే పల్లెల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి రేగొండ,కొత్తపల్లి గోరి మండలాల్లోని పలు గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు సుమారు రూ.3.50 కోట్లతో నూతనంగా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అధికారికంగా ప్రారంభించారు.నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఇందులో భాగంగా మొదటగా రేగొండ మండలంలో ఉపాధి హామీ నిధులు రూ. 2.50 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు పనులను ఎమ్మెల్యే గండ్ర ప్రారంభించారు.మండల పరిధిలోని రూపిరెడ్డిపల్లి,పోచంపల్లి,మడతపల్లి, పొనగండ్ల, గుడేపల్లి,పెద్దoపల్లి, గడిపల్లి, రేగొండ,రావులపల్లి,జూబ్లీ నగర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థలను ఆయన ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.అదేవిధంగా దమ్మన్నపేట గ్రామంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా నిర్మించిన గ్రామపంచాయతీ ప్రహరీ గోడను ఆయన ప్రారంభించారు.ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో ఇటువంటి ప్రహరీ గోడల నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.అనంతరం కొత్తపల్లి గోరి మండలంలో రూ.1 కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.మండలంలోని సుల్తాన్పూర్,కొత్తపల్లి గోరి,నిజాంపల్లి, బాలయ్యపల్లి, విజయపల్లి, దామరంచపల్లి గ్రామాలలో కొత్తగా వేసిన అంతర్గత రహదారులను ఆయన ప్రారంభించి మాట్లాడారు.గ్రామీణ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిధులను మంజూరు చేయించినట్లు వివరించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ ఉమ్మడి మండలాల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, తహసీల్దార్లు శ్వేత, హేమ, కోటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు, పీఏసీఎస్ చైర్మన్ విజన్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరసయ్య విశేషంగా పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉమేష్ గౌడ్, మేకల బిక్షపతి, రవీందర్రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, సాంబయ్య,సుధాకర్, శంకరయ్య,కిరణ్ పటేల్, వావిలాల రమేష్,సంతోష్,వివిధ గ్రామాల సర్పంచులు రవీందర్, రాజేశ్వరరావు, రవి, మౌనిక అంజి, సునీత రవీందర్, అరుణ రజనీకాంత్, గడ్డే రఘు, రాజయ్య, నిమ్మల శంకర్, జిల్లెల్ల సామిల్,వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు