సిందూజ-సురేష్ గౌడ్‌లను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
సిందూజ-సురేష్ గౌడ్‌లను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 3వ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం సంతోష్ కుమార్ గౌడ్-మమత మేనకోడలు,గడ్డం యాదగిరి -కొమురమ్మ మనుమరాలుచి.ల.సౌ.సిందూజ,చి. సురేష్ గౌడ్‌ల వివాహ వేడుక ఘనంగా జరిగింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలు బహుకరించారు.నూతన దంపతులకు సుఖసంతోషాలతో నిండిన వైవాహిక జీవితం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోధుమల మధుసూదన్,మండల అధ్యక్షులు తూల్ల కుమారస్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు సిలివేరు కుమారస్వామి యాదవ్,గుజ్జ వీర రాఘవ రావు,తిరుపతి సురేష్, చిలువరు రమ-రాజశేఖర్,తుమ్మల అరుణ-శ్రీధర్,బానోత్ జ్యోతి-నవీన్, జిల్లా నాయకులు తుమ్మల యాకయ్య,పిఏసీఎస్ డైరెక్టర్ మార్త సారంగపాణి, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి డా.కొండేటి శ్రీనివాస్, పసునూరి రాజశేఖర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను అభినందించారు.