సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవాలు
ఘనపూర్ చాగల్లు శివునిపల్లి మున్సిపాలిటీ పరిధిలో సిపిఐ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎండీ యునుస్, మండల కార్యదర్శి సముద్రాల రాజు మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక, శ్రామికుల హక్కుల దినం కార్మికుల నెత్తుటి రక్తంతో సాధించినటువంటి రోజు మేడే. రోజు 16 గంటలు పనిచేస్తున్నటువంటి నాటి శ్రామిక వర్గాన్ని విముక్తి చేసి ఎనిమిది గంటల పని కల్పించినటువంటి గొప్ప రోజు మేడే ఈ పవిత్రమైన మే డే సందర్భంగా శ్రామిక కార్మిక కర్శక వర్గాలు మరింతగా పోరాడి మరిన్నిహక్కుల సాధించాలి.. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులకు ఎనిమిది గంటల పని కోసం జరిగిన హే మార్కెట్ ఘటన పోలీస్ కార్పులకు దారితీసింది దీని పునాదిగా శ్రమ దోపిడీ వ్యతిరేకంగా కార్మికులు చేసిన త్యాగానికి ఇది ప్రతీక నాడు పరిశ్రమలలో కార్మికుల రోజుకు 16 నుంచి 18 గంటలు పని చేసేవారు దీని వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని కోసం 8 గంటల విశ్రాంతి కోసం జరిగిన పోరాటమే ఈ మేడే. రోజున చికాగో నగరంలో నాటి పోలీస్ కాల్పులలో ప్రాణాలు కోల్పోయిన కార్మిక అమరవీరుల త్యాగం వల్లనే ఈ రోజు ప్రపంచ కార్మికులకు ఎనిమిది గంటల పని దినం అనేది సాధించడం జరిగింది. 1889 పారిస్ లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశంలో 1886 చికాగో సమ్మెను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా మేడే రోజు అమరులైనటువంటి కార్మికుల అమరత్వానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరికీ ఏటా మే 1న కార్మిక దినోత్సవం జరుపుకోవాలని 1889లో ప్యారిస్ లోని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం మే 1న ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామిక కార్మిక వర్గం వైభవంగా ఘనంగా జెండాలు ఎగిరేసి జరుపుకుంటారు భారత దేశంలో మొట్టమొదటిసారిగా 1923వ సంవత్సరంలో మేడే ఉత్సవాలు జరిగాయి ఇది కార్మిక ఐక్యతకు వారి హక్కులను శ్రమను గౌరవించే రోజు గా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు ఎర్రజెండాలు ప్రదర్శనలు చేసి ఎర్రజెండాలో తోరణాలు కట్టి ఎర్రజెండా కార్మికులు