తెలుగు గళం న్యూస్/ భద్రాచలం 29 మే 26
గిరిజన సహకార సంస్థ హైదరాబాద్ వారి 38 జీవో ప్రకారము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, గిరిజన ప్రైమరీ కోపరేటివ్ సొసైటీ (జిసిసి) లలో పనిచేయుచున్న సేల్స్ మేన్లు, ఎం సి డబ్ల్యూ వర్కర్లు, డ్రైవర్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేయడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
ఐటీడీఏ కార్యాలయంలోని తన ఛాంబర్ లో జిసిసి అధికారులు మరియు సేల్స్ మెన్ కమిటీ సభ్యుల సమక్షంలో, జిసిసి పరిధిలోని ఐదు సొసైటీలలోని డిఆర్ డిపోలలో పనిచేయుచున్న సేల్స్ మేన్లు, ఎం సి డబ్ల్యూ వర్కర్లు, డ్రైవర్లతో కలిపి 28 మంది మంది సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 శాతం సిబ్బందికి బదిలీలు చేయవలసి ఉండగా 11 మందిని బదిలీ చేశామని, ఈ బదిలీల ప్రకయలో వికలాంగులు మరియు మెడికల్ పరంగా ముందుగా ప్రాధాన్యత ఇచ్చి కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేశామని అన్నారు. ఈ బదిలీలలో సేల్స్ మేన్ లు, ఎం సి డబ్ల్యూ వర్కర్లు, డైవర్ల కలిపి 11 మందిని కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేశామని అన్నారు. ఈ బదిలీల ప్రక్రియ ఎటువంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా సిబ్బంది కోరుకున్నచోట బదిలీలు చేయడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఎంజిసిసి సమ్మయ్య, జిసిసి మేనేజర్లు లక్ష్మాజి, జయరాజ్, భూషయ్య,అకౌంటెంట్లు, ఖయ్యూం, డ్రైవర్లు, సేల్స్ మెన్లు, తదితరులు పాల్గొన్నారు.