అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలి
అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలి
పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
రైతులను నిర్లక్ష్యం చేస్తే తగినమూల్యంచెల్లించుకోక తప్పదు
బి కె యం యు జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకట్రాములు పర్వతగిరి మండల కేంద్రంలో గురువారం
ఆరుగాలం కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి రైతులు పండించిన పంటలను ప్రభుత్వం సకాలంలో ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతమని, రైతు రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో దారుణంగా గాలులు వీస్తూ భారీ వర్షాలు పడి కళ్ళాలలోనే వడ్లు మొక్కజొన్న చేతికి అందిన పంటలు తడిసి ముద్దవ్వడం, కొన్ని ప్రాంతాల్లో కొట్టుకపోవడంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. అనేక గ్రామాలలో ఐకెపి సెంటర్లలో ధాన్యం రాశులపై టార్పాలిన్ కప్పిన క్రింది నుండి వర్షపు నీరు చేరి ధాన్యమంత తడిస్తే రైతులు తీవ్ర ఆవేదనకు గురౌతున్నారన్నారు. సొంత పెట్టుబడి లేని రైతులు ఎన్నో ఇబ్బందులు పడి అప్పులు చేసి ఎన్నో ఆశలతో పంటలు పండిస్తే ప్రభుత్వ సకాలంలో కొనకపోవడం, అకాల వర్షాలు రావడం తో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ధన్య రాశుల వద్ద రాత్రింబగళ్ళు ఉంటున్న కొందరు రైతులు మనస్థాపానికి గురై, మరికొందరు ప్రమాదాలకు గురై కల్లాల వద్దనే ప్రాణాలు కోల్పోతుంటే వారి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారన్నారు. మరణించిన కుటుంబాల వారికి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేసియో చెల్లించి అన్ని విధాల ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, వర్షాలకు తడవకుండా ప్రతి గ్రామంలో పక్కాగా కల్లాల షెడ్లు నిర్మించాలని, రైతు సమస్యలను యుద్ధ ప్రాతిపదికగా పరిష్కరించ కుంటే రైతాంగ ఆగ్రహానికి గురికావలసి వస్తుందని వెంకట్రాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.