గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లుప్రారంభం
BREAKING NEWS
గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లుప్రారంభం
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థ ఆధ్వర్యంలో వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల్లోని జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ.బై పి సి గ్రూపులలో ప్రవేశాలకు నేరుగా అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి డి.ఎస్. వెంకన్న తెలిపారు.
కౌన్సెలింగ్ తేదీ & వేదిక:
తేదీ: 16-05-2026, ఉదయం 10:00 గంటలకు
వేదిక: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, యాకుబ్పుర, వరంగల్.
ప్రవేశం కల్పించే కళాశాలలు:
గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలు:
- దేవన్నపేట, హనుమకొండ జిల్లా
- గూడూరు, పాలకుర్తి, జనగామ జిల్లా
- పర్వతగిరి, వరంగల్ జిల్లా
- మూడుచెక్కలపల్లి, నర్సంపేట, వరంగల్ జిల్లా
గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాల: - నర్సంపేట, వరంగల్ జిల్లా
అర్హత: గిరిజన మరియు గిరిజనేతర విద్యార్థినీ, విద్యార్థులు అర్హులు.
తీసుకురావాల్సిన పత్రాలు:
టీసీ, మెమో, స్టడీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రంతో పాటు 2 జతల జిరాక్స్ ప్రతులు తప్పనిసరిగా తీసుకురావాలి.
ఆసక్తిగల విద్యార్థులు నిర్ణీత తేదీ, సమయానికి హాజరు కావాలని ఆర్సీఓ డి.ఎస్. వెంకన్న ఒక ప్రకటనలో కోరారు.