సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/జూన్ 2
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామపంచాయతీ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ అనిత శ్రీకాంత్ మాట్లాడుతూ,”తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేకమంది అమరవీరులు ప్రాణత్యాగాలు చేశారు.సబ్బండ వర్గాలు ఏకమై పోరాటం చేయడం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అమరవీరుల ఆశయ సాధన కోసం, సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అందరం ముందుకు సాగాలి”అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్,వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి,పాఠశాల ఉపాధ్యాయులు,గ్రామస్థాయి అధికారులు,గ్రామ ప్రముఖులు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.