తెలుగు గళం న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లా లో గల గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన వసతి గృహాలు మరియు అన్ని గురుకుల పాఠశాలలకు అవసరమైన కూరగాయలు, అరటిపండ్లు మరియు స్కిన్లెస్ చికెన్ సరఫరా చేయుటకు ఆసక్తి గల అమ్మకందారుల నుండి సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.
ఆసక్తి గల అమ్మకందారులు, టెండర్ ఫారం ధర రూ.2,000 /- డిమాండ్ డ్రాఫ్ట్ ఉప సంచాలకులు గిరిజన సంక్షేమ శాఖ ఐటిడిఏ భద్రాచలం పేరున ఎస్బిఐ భద్రాచలం నందు చెల్లుబాటు అయ్యే విధంగా సమర్పించి ఈనెల 31.05.2026 నుండి 05.06.2026 వరకు ఉపసంచాలకులు గిరిజన సంక్షేమ శాఖ ఐటిడిఏ భద్రాచలం వారి కార్యాలయం నుండి టెండర్ ఫారం పొందవచ్చునని, ధారవత్ సొమ్ము కూరగాయాలు రూ.50,000/-పండ్లు, రూ.50,000/- స్కిన్లెస్ చికెన్, రూ.50,000/- డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో టెండర్ ఫారంతో పాటుగా టెండరు బాక్స్ నందు, సమర్పించవలసి ఉంటుందని, SC, ST సరఫరదారులకు దారవత్తు డిపాజిట్లో 20% రాయితీ కలదని, టెండర్ ఫారాలు జూన్ 5వ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు సమర్పించాలని ఆయన అన్నారు.
PAN CARD, TIN CARD నెంటర్లు, స్వంత దుకాణం, బ్యాంక్ ఖాతా కలిగి ఉమ్మడి భద్రాద్రి జిల్లా కు చెందినవారై ఉండాలని, జూన్ 06.06.2026 ఉదయం 11:00 గం. లకు సీల్డ్ టెండర్ తెరచి ప్రాజెక్టు అధికారి, ఐటిడిఏ భద్రాచలం తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.