కొల్లూరి దేవేందర్‌కు మెరుగైన వైద్యం అందించాలి
పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన కొల్లూరి దేవేందర్ ఇటీవల గడ్డి కట్టలు కట్టే యంత్రంలో చేయి వేళ్లు చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు.ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ఆసుపత్రికి వెళ్లి దేవేందర్‌ను పరామర్శించారు.గాయపడిన దేవేందర్‌కు మనోధైర్యం కల్పించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి దేవేందర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.దేవేందర్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అవసరమైన అన్ని విధాలుగా అండగా ఉంటానని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.