మృతుల కుటుంబాలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శలు చేశారు.గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్, విశ్రాంత అటెండర్ పంతంగి ఉప్పలయ్య శుక్రవారం గుండెపోటుతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న ఎర్రబెల్లి వారి నివాసానికి వెళ్లి ఉప్పలయ్య చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి,కుటుంబానికి మనోధైర్యం,నింపారు.అనంతరం అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త తల్లి చింతకాయల మల్లమ్మ ఇటీవల మరణించగా, వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మాజీ మంత్రి వెంట మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, స్థానిక సర్పంచ్ డెక్క సునీత-కుమారస్వామి, మాజీ సర్పంచ్ అమడగని రాజు యాదవ్, మనోజ్ గౌడ్, మండల సీనియర్ నాయకులు బొట్ల మధు, జుట్టుకొండ చిన్ననర్సయ్య,పట్టాపురం ఎల్లగౌడ్, పల్లె ప్రకాష్,బోయినపెల్లి స్వామిరావు,కొందాటి కుమార్ రావు, గ్రామస్తులు బైరి ఎల్లయ్య, మోడం రమేష్,రావుల రవి, అలుగురి ఎల్లయ్య, సాయిలు, కరిమిళ్ల సంపత్ రావు, మండల సోషల్ మీడియా నాయకులు చిన్నపెల్లి అజయ్, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.