సత్తుపల్లి ఎమ్మెల్యే శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి
తుమ్మల రాజకీయ ప్రస్థానానికి 40 ఏళ్లు
సత్తుపల్లి,ఆర్ సి,మే 8(తెలుగుగళం)న్యూస్ : తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలి సారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి ఆధ్వర్యంలో శుక్రవారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువ నాయకుడు తుమ్మల యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి, డాక్టర్ దయానంద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు రాజకీయ కుట్రలో భాగంగా పుకార్లు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల నిర్మాణాలకు మట్టి, ఇసుక అవసరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని, అవినీతికి తమ కుటుంబంలో స్థానం లేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రజల మధ్యే ఉంటూ సేవ కొనసాగిస్తామని, ప్రజలకు నిజం తెలుసని తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి, కల్లూరు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యువజన, ఎన్ఎస్యూఐ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, అభిమానులు పాల్గొన్నారు.