మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్
పేదవారి కళలు నిజం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి / మే8
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలంలోని పెద్దతండ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో అధికారులు మరియు సర్పంచ్ల కలిసి ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్.
పేదవారి కళలు నిజం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆర్ గ్యారంటీలు అమలు చేసి దిశగా ప్రజా ప్రభుత్వ పని చేస్తుందని, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు,తెల్ల రేషన్ కార్డు,సన్న బియ్యం,రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు, మహిళ తల్లులకు ఉచిత బస్సు అనేక సౌకర్యాలు కల్పించి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవడంలో ప్రజా నాయకుడు కే. ఆర్. నాగరాజు ముందు వరుసలో ఉంటారని తెలిపారు.ఈ ప్రాంత అభివృద్ధి కోసం,ఈ ప్రాంత ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం మా శాసనసభ్యులు అనేక రకాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పథకాలు దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికె అందించడం ఈ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుశీల వీరన్న, ధూప తండా సర్పంచ్ తిరుపతి,అన్నారం గ్రామపటి అధ్యక్షుడు గొడుగు రమేష్, బూత్ కన్వీనర్ మోహన్ నాయక్, నాయకులు హోల్ సింగ్, యూత్ కాంగ్రెస్ నాయకులు విజేందర్ మరియు తదితర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.