విద్యుత్ శాఖ పట్టణ అసిస్టెంట్ ఇంజినీర్ ఉబ్బన శరత్
BREAKING NEWS
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం”
సత్తుపల్లి,ఆర్ సి,మే 08(తెలుగుగళం) న్యూస్ : సత్తుపల్లి మండల పరిధిలోని సదాశివునిపాలెం గ్రామంలో గల విద్యుత్ ఉపకేంద్రంలో నూతన ఏబీ స్విచ్ల ఏర్పాటు పనులు, ఉపకేంద్ర నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో నేడు అనగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ పట్టణ అసిస్టెంట్ ఇంజినీర్ ఉబ్బన శరత్ శుక్రవారం ఓ ప్రకటనలో మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు.దీంతో సదాశివునిపాలెం,సిద్ధారం గ్రామాలతో పాటు తుంబూరు వ్యవసాయ ఫీడర్, నారాయణపురం ఫీడర్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.