మృతుల కుటుంబాలను పరామర్శించిన భారతీయ జనతా పార్టీ నాయకులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గూడెపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యులను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ఆదివారం పరామర్శించారు.గ్రామానికి చెందిన ధరంసోత్ సరిత మూడు రోజుల క్రితం పాము కాటుతో మరణించగా, అలాగే మోరే లక్ష్మి ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు.ఈ విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాపయ్య, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి ప్రసాదరావు,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోల్సాని తిరుపతి రావు సంయుక్తంగా గూడెపల్లి గ్రామాన్ని సందర్శించారు.మృతుల నివాసాలకు వెళ్లిన నాయకులు వారి చిత్రపటాలకు నివాళులర్పించి,తీవ్ర శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు.వారి కుటుంబాలకు తమ సానుభూతిని తెలియజేస్తూ,పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రేగొండ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు నిమ్మల రాజేశ్వర్ రావు, నాయకులు పాపారావు,ఇతర ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.