BREAKING NEWS
వరంగల్ సీపీ ఆధ్వర్యంలో 3, 4 జోన్ల పోలీస్ సిబ్బందికి గ్రీవెన్స్ కార్యక్రమం




ఈ69న్యూస్ వరంగల్ మే15
వరంగల్ రేంజ్ పరిధిలోని 3, 4 జోన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి సంబంధించిన శాఖాపరమైన సమస్యలపై ఇంచార్జ్ డీఐజీ, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్ శుక్రవారం వరంగల్ రేంజ్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పదోన్నతులు, బదిలీలు, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తదితర అంశాలకు సంబంధించిన సిబ్బంది, అధికారులు సమర్పించిన వినతులను వరంగల్ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.