తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట /సెప్టెంబర్ 28
వర్ధన్నపేట మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.వారి వద్ద నుండి సుమారు ఒక కిలో ఎండు గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.50,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.
నిందితుల వివరాలు:
ముత్యాల శ్యామ్ తండ్రి భాస్కర్, కాట్ర్యాల గ్రామం, వర్ధన్నపేట మండలం,పిన్నింటి భరత్ తండ్రి సమ్మరావు, వర్ధన్నపేట పట్టణం,పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు గత 2-3 సంవత్సరాలుగా గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్నారు. 10 రోజుల క్రితం శ్యామ్ హైదరాబాద్, సికింద్రాబాద్ మీదుగా వైజాగ్ లోని అరకులో ఉన్న తన స్నేహితుడు సుభాష్ వద్దకు వెళ్లి ఎండు గంజాయి తీసుకుని రైలులో కాజీపేట వరకు, అక్కడి నుండి కాట్ర్యాలలోని తన ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటి నుండి శ్యామ్, భరత్ తో పాటు మరికొంత మంది స్నేహితులు కలిసి గంజాయి సేవించారు.ఈ గంజాయిని వర్ధన్నపేటలో విక్రయించేందుకు కాట్ర్యాల ఆటో స్టాండ్ నుండి ఆటోలో వస్తుండగా ఇల్లంద గ్రామ శివారులోని వ్యవసాయ మార్కెట్ వద్ద వర్ధన్నపేట పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి జియో భారత్ కీప్యాడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎస్ ఐ ఎన్. సాయిబాబు మాట్లాడుతూ వర్ధన్నపేట మండలంలో ఎవరైనా గంజాయి లేదా మత్తు పదార్థాలు విక్రయించినా,తరలించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.ఈ ఆపరేషన్ లో రాజు, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, సాగర్ పాల్గొన్నారు.
