సెక్టార్ సూపర్ వైజర్ వసంతరాణి ఆధ్వర్యంలో సోమవారం మెగా పోషణమాసంసెక్టార్ సూపర్ వైజర్ వసంతరాణి ఆధ్వర్యంలో సోమవారం మెగా పోషణమాసం

సత్తుపల్లి/వేంసూరు సెప్టెంబర్ 28 (తెలుగుగళం)న్యూస్: నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల కందుకూరు గ్రామపంచాయతీలో వెంకటాపురం సెక్టార్ సూపర్ వైజర్ వసంతరాణి ఆధ్వర్యంలో సోమవారం మెగా పోషణమాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా 12 మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు,12 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు.
తల్లులు, చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరమని ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్తుపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ బి.సత్యవతి వివరించారు. పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను ప్రదర్శించి, వాటి ప్రాధాన్యతను తల్లులకు వివరించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మందపాటి వెంకటరెడ్డి గర్భిణులకు చీర,సారె, పూలు,పండ్లు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో: ఉపసర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు వెంకటప్పారెడ్డి,గ్రామ పంచాయతీ కార్యదర్శి పి.సునీత,ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమేశ్వరరావు,ధర్మారావు, అంగన్‌వాడీ టీచర్లు సుశీల,ఎలిజబెత్,పద్మ, జయమ్మ,మారేశ్వరి, చామంతి,ఆనందకుమారి, ఏఎన్‌ఎం జ్యోతి,ఆశా కార్యకర్తలు,తల్లులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *