: బెడిక రమేష్: బెడిక రమేష్

: బెడిక రమేష్

  • ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటుతో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం
  • ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి

తెలుగు గళం ములుగు జిల్లా, సెప్టెంబర్ 29:

తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 24న జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్‌. నం.59 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 200 నూతన అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి, అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానాలను మంజూరు చేసిందని, అందులో భాగంగా ములుగు జిల్లాకు మంజూరైన నూతన న్యాయస్థానాన్ని ఏటూరునాగారం మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని ములుగు జిల్లా పట్టభద్రుల సంఘం నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా నాయకులు, మాజీ ఎంపీటీసీ బెడిక రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఏటూరునాగారం ఆరు మండలాలకు భౌగోళికంగా అనుకూలమైన కేంద్రంగా ఉందని తెలిపారు. ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ అవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల ప్రజలు ములుగు వరకు ప్రయాణించాల్సిన అవసరం తగ్గి, సమయం మరియు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని అన్నారు. అదేవిధంగా ఏటూరునాగారం పోలీసు ఉపవిభాగం పరిధిలో న్యాయస్థానం ఏర్పాటు కావడం వల్ల పోలీసు అధికారులు, సాక్షులు, దర్యాప్తు సిబ్బంది న్యాయస్థాన కార్యకలాపాలకు హాజరు కావడం సులభతరం అవుతుందని తెలిపారు. దీనివల్ల న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థల మధ్య సమన్వయం మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతానికి ఇప్పటికే ఆర్డీవో కార్యాలయం, ఆర్టీసీ బస్సు డిపో వంటి సంస్థలు మంజూరైన నేపథ్యంలో, నూతన న్యాయస్థానం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని బెడిక రమేష్ అన్నారు. న్యాయస్థానం ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని, స్థానిక యువతకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండటం, మారుమూల ప్రాంతాల ప్రజల ప్రయాణ భారం తగ్గించడం, న్యాయ సేవలను సులభతరం చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ములుగు జిల్లాకు మంజూరైన నూతన న్యాయస్థానాన్ని ఏటూరునాగారం మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులు, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బెడిక రమేష్ డిమాండ్ చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *