చైర్మన్‌గా జే. సంతోష్ నాయక్ వైస్ చైర్మన్‌గా టీ. నరసింహులు ఎన్నికచైర్మన్‌గా జే. సంతోష్ నాయక్ వైస్ చైర్మన్‌గా టీ. నరసింహులు ఎన్నిక

చైర్మన్‌గా జే. సంతోష్ నాయక్
వైస్ చైర్మన్‌గా టీ. నరసింహులు ఎన్నిక

తెలుగు గళం న్యూస్ బుక్కరాయ సముద్రం

బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ బాలుర పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ డి. హార్జే నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో కమిటీ చైర్మన్‌గా జే. సంతోష్ నాయక్, వైస్ చైర్మన్‌గా టీ. నరసింహులు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లను పాఠశాల సిబ్బంది, కమిటీ సభ్యులు అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు, నాణ్యమైన భోజనం తదితర అంశాలపై సమన్వయంతో పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.
విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల అభివృద్ధిలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ కీలక పాత్ర పోషించాలని ప్రిన్సిపాల్ డి. హార్జే నాయక్ ఆకాంక్షించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *