పీహెచ్‌సీ మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలుపీహెచ్‌సీ మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు
  • పీహెచ్‌సీ మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు
  • మైనర్ రిపేర్లు త్వరలోనే చేపడతాం

తెలుగు గళం గోవిందరావుపేట, సెప్టెంబర్ 29:

గోవిందరావుపేట మండలం లింగాల గ్రామపంచాయతీ పరిధిలోని కొడిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మొదలపల్లి రవీందర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ సిబ్బందిని ఆసుపత్రికి ప్రతిరోజూ వచ్చే రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజుకు సుమారు 20 నుంచి 30 మంది వరకు ఓపీకి వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. అనంతరం పీహెచ్‌సీ వైద్యులు విజయ్ ఆసుపత్రిలో అవసరమైన మైనర్ రిపేర్లను సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. టాయిలెట్లు, బాత్రూమ్‌లు, ఫ్యాన్లు, కిటికీలు తదితర మౌలిక వసతులతో పాటు సబ్‌సెంటర్‌కు సంబంధించిన సమస్యలను కూడా వివరించారు. వీటిని పరిశీలించిన సర్పంచ్ రవీందర్ అవసరమైన మరమ్మతులను త్వరలోనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పీహెచ్‌సీలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ తనిఖీలో పంచాయతీ కార్యదర్శి మోడెం రాజేష్ తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *