జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్పంచ్‌కు అవార్డు ప్రదానం
జనగామ, అక్టోబర్ 08 (ఈ69న్యూస్)

జనగామ జిల్లా నాగారం గ్రామానికి అరుదైన గుర్తింపు లభించింది. నాగారం గ్రామం టీబీ రహిత గ్రామంగా ఎంపిక కావడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, టీబీ నిర్మూలనకు సమష్టిగా కృషి చేసిన ఫలితంగా ఈ గుర్తింపు దక్కింది.ఈ సందర్భంగా గురువారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాగారం గ్రామ సర్పంచ్ గొరిగే ఉప్పలమ్మ–బిక్షపతిలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించి అవార్డును ప్రదానం చేశారు.నాగారం గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దడంలో కీలకంగా పనిచేసిన ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, గ్రామ సిబ్బందితో పాటు సహకరించిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా అభినందించారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం సమష్టిగా చేసిన కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు.టీబీ రహిత గ్రామంగా నాగారానికి గుర్తింపు తీసుకురావడంలో కృషి చేసిన సర్పంచ్ గొరిగే ఉప్పలమ్మ–బిక్షపతిలకు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, గ్రామ సిబ్బందికి గ్రామ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ నాగారం గ్రామం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.