సహజ వనరులతో ఎరువులు, పురుగుమందుల తయారీపై అవగాహన.. వర్మీకంపోస్ట్ వినియోగంపై రైతులకు ప్రదర్శన

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 8 (ఈ69న్యూస్)
జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF)లో భాగంగా స్టేషన్ ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎస్. కరుణాకర్ పాల్గొని, ప్రకృతి వ్యవసాయంలో సహజ వనరులతో తయారు చేసే ఎరువులు, పురుగుమందుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయనిక పురుగుమందుల అధిక వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆహార ధాన్యాల్లో పురుగుమందుల అవశేష ప్రభావాన్ని తగ్గించి, సురక్షితమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చని వివరించారు.అలాగే NMNF పద్ధతిలో సాగు చేస్తున్న వరి పొలాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. వర్మీకంపోస్ట్ వినియోగం ద్వారా నేల సారాన్ని పెంపొందించడంతో పాటు, పంటకు అవసరమైన పోషకాలను సహజ పద్ధతుల్లో అందించవచ్చని ప్రదర్శన ద్వారా వివరించారు.జనగామ జిల్లా NMNF కోఆర్డినేటర్ హరీష్ రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందించారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి ముక్కెర స్వరూప, AEO శ్రావణి, గ్రామ కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందుతూ, సహజ వనరుల వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటల సాగుకు తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకున్నారు.