- రూ.6.80 కోట్ల ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
- గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత
- -మండల పార్టీ అధ్యక్షులు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు
తెలుగు గళం మంగపేట, అక్టోబర్ 08:
మంగపేట మండల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.6.80 కోట్లతో మండలంలోని గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. బాలన్నగూడెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మండల పార్టీ అధ్యక్షులు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు నారికేళం కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మంగపేట మండల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డైరెక్టర్ పూజారి సురేందర్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య, మాజీ మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, పగిడిపెల్లి వెంకటేశ్వర్లు, పెద్ది నరసింహారావు, బసారీకారి హరికృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
