ఏటూరునాగారం ఎఫ్‌ఆర్‌ఓ రెహమాన్ఏటూరునాగారం ఎఫ్‌ఆర్‌ఓ రెహమాన్
  • అటవీ–వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
  • అక్రమ ఆక్రమణలకు అడ్డుకట్ట..
  • వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక చర్యలు
  • ఏటూరునాగారం ఎఫ్‌ఆర్‌ఓ రెహమాన్

తెలుగు గళం ఏటూరునాగారం, అక్టోబర్ 08:

అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా కలిసి పనిచేయాలని ఏటూరునాగారం ఎఫ్‌ఆర్‌ఓ రెహమాన్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో విస్తారమైన అటవీ ప్రాంతం ఉన్నందున అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని అన్నారు. అక్రమంగా ఆక్రమించిన అటవీ భూములను గుర్తించి తిరిగి అటవీశాఖ ఆధీనంలోకి తీసుకునే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అటవీ భూముల రక్షణతో పాటు సుమారు 650 హెక్టార్లలో అటవీకరణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వన్యప్రాణుల వేటను అరికట్టడంతో పాటు వేటగాళ్లకు అవగాహన కల్పించి వారిని వన్యప్రాణుల రక్షకులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గతంతో పోలిస్తే వేట పరికరాలు తగ్గడం ప్రజలు, మీడియా సహకారంతో సాధ్యమైందన్నారు. అభయారణ్యాలు, అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వన్యప్రాణులకు నీటి వనరులను సంరక్షించడం, రహదారులపై వన్యప్రాణుల సంచార ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.“అడవిని కాపాడేందుకు సమాజం సిద్ధంగా ఉంటే అటవీశాఖ ముందుంటుంది. అడవులు ముక్కలు కాకుండా కాపాడుకోవడానికి ప్రజల సహకారం అవసరం. మనం ప్రకృతిని రక్షిస్తే భవిష్యత్ తరాలు సురక్షితంగా ఉంటాయి” అని ఎఫ్‌ఆర్‌ఓ రెహమాన్ పేర్కొన్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ఒక్క అటవీశాఖ బాధ్యత కాదని, ప్రజలు–అధికారులు–మీడియా సమష్టిగా పనిచేసినప్పుడే అటవీ సంపదను భవిష్యత్ తరాలకు అందించగలమన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *