- స్పీడ్ లిమిట్ దాటితే లారీలు సీజ్!
- జిల్లావ్యాప్తంగా 24 గంటల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు!
- రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: ఎస్పీ ఆదేశాలు
తెలుగు గళం ములుగు జిల్లా అక్టోబర్ 09:
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఇసుక లారీల అధిక వేగాన్ని నియంత్రించేందుకు వేగ పరిమితి దాటిన వాహనాలను సీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కమలాపురం, మండపాక, తాడ్వాయి, జవహర్‌నగర్ టోల్గేట్ తదితర ప్రాంతాల్లో 24 గంటల పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించడంతో పాటు వేగ నియంత్రణ పరికరాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రధాన రహదారులు, చెక్‌పోస్టుల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నేర సమీక్షా సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్, అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
