తెలుగు గళం న్యూస్ ఐనవోలు/అక్టోబర్ 09
హనుమకొండ జిల్లా పున్నెల్, న్యూఢిల్లీలో జరగనున్న 12వ జాతీయస్థాయి సైన్స్ ఇన్స్పైర్ మనక్ పోటీలకు ఏకశిల విద్యాసంస్థ విద్యార్థిని కె.జెస్సీ ఎంపికైంది.ఈ సందర్భంగా ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ సంస్థలో విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక,క్రీడా రంగాల్లో రాణించేలాప్రోత్సాహంఅందిస్తున్నామన్నారు.జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థిని జెస్సీ విజేతగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.అనంతరం ఇటీవల తమిళనాడులో జరిగిన జాతీయస్థాయి ఖో-ఖో పోటీల్లో పాల్గొన్న 24 మంది విద్యార్థులను కూడా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎం.డి.బాబా, వైస్ ప్రిన్సిపల్ కె.శ్రీనివాస్, గైడ్ టీచర్ గుర్రం రమేష్, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు