యాసం రమేష్ మాదిగయాసం రమేష్ మాదిగ
  • బహుజన రాజ్యాధికార సాధనకు కాన్షీరాం జీవితం స్ఫూర్తి
  • మహనీయుడి ఆశయాల సాధనకు బహుజనులు కృషి చేయాలి: యాసం రమేష్ మాదిగ

తెలుగు గళం వెంకటాపురం(నూగూర్), అక్టోబర్ 9:

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ఆవరణలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షీరాం వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాపురం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాసం రమేష్ మాదిగ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బహుజనుల రాజకీయ చైతన్యానికి మార్గదర్శకుడు కాన్షీరాం అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చైతన్యవంతులను చేస్తూ ఎన్నో ఉద్యమాలు నిర్వహించి, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)ని స్థాపించి బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బహుజనుల హక్కులు, అభివృద్ధి, రాజకీయ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు వేల్పుల మల్లేష్ మాదిగ, యాసం మహేష్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు కొడారి సత్యం మాదిగ, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు చెన్నం తిరుపతి మాదిగ, కాట మహేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *