15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్లో పోలీసు అమరవీరుల దినోత్సవం”
సత్తుపల్లి,ఆర్ సి,అక్టోబర్ 21 (తెలుగుగళం) న్యూస్:
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ఘన నివాళ్ళులర్పించారు. మండల పరిదిలోని బేతుపల్లి – గంగారంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్లో బుధవారం పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమ0లో బెటాలియన్ కమాండెంట్ ఎన్. పెద్దబాబు ముఖ్య అతిథిగా పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల స్మారక స్థూపంవద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్మృతి పరేడ్ ద్వారా అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా కమాండెంట్ పెద్దబాబు మాట్లాడుతూ దేశంలోని వివిధ పోలీసు విభాగాల్లో విధులు నిర్వహిస్తూ దేశ రక్షణ, సమాజ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సంఘ విద్రోహశక్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో: బెటాలియన్ అదనపు కమాండెంట్ ఏ. అంజయ్య, అసిస్టెంట్ కమాండెంట్ బి. వినాయకరావు,ఇతర అధికారులు,పోలీసు సిబ్బంది,హోంగార్డులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.
