కార్యక్రమంలో పాల్గొన్న... కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్కార్యక్రమంలో పాల్గొన్న... కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 ( తెలుగు గళం ) న్యూస్:

శేరిలింగంపల్లి డివిజన్… హుడా ట్రేడ్ సెంటర్ రామాలయం ఆవరణలో దసరా పండుగను పురస్కరించుకొని ఘనంగా శమీ పూజ, రావణ దహన కార్యక్రమం నిర్వహించారు.

శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో,కన్నేపల్లి రామచంద్రమూర్తి అయ్యగారి స్వయం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిపారు
షమీ పూజ అనంతరం వేలాది భక్తుల నడుమ రావణ దహనం కన్నుల పండుగగా సాగింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ ఆయన సతీమణి రాగం జాగృతి సాయి రాగం అభిషేక్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… హుడా ట్రేడ్ సెంటర్ రామాలయం ఆవరణలో ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా అయ్యగారి స్వయం పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని, దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, తెలిపారు ఈ పవిత్రమైన రోజున శేరిలింగంపల్లి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *