హాజరైన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గున్ రెడ్డి అఖిల్ రెడ్డిహాజరైన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గున్ రెడ్డి అఖిల్ రెడ్డి

ధర్మసాగర్ మండల కేంద్రంలో అట్టహాసంగా వేడుకలు

సాంస్కృతిక ప్రదర్శనలతో హోరెత్తిన ప్రాంగణం

హాజరైన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గున్ రెడ్డి అఖిల్ రెడ్డి

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మసాగర్ మండలంలోని రిజర్వాయర్ వద్ద రావణాసుర వధ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలకు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గుండ్రెడ్డి అఖిల్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు.
మంగళవారం సాయంత్రం సాంస్కృతిక కళాబృందాల నృత్య ప్రదర్శనలతో ప్రారంభమైన ఉత్సవాలు, రావణాసుర దహనంతో పతాక స్థాయికి చేరాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన రావణ దహనాన్ని తిలకించేందుకు ధర్మసాగర్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ధర్మసాగర్ రిజర్వాయర్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *