మంత్రి సీతక్క ఆదేశంమంత్రి సీతక్క ఆదేశం

ములుగు జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు!

  • ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం..
  • క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
  • ఈదురుగాలుల ముప్పు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.. మంత్రి సీతక్క ఆదేశం

తెలుగు గళం ములుగు, అక్టోబర్ 28:

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ములుగు జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈదురుగాలుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *