ఎర్రబెల్లి దయాకర్ రావు,అరూరి రమేష్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్న సీనియర్ క్యాడర్
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/అక్టోబర్ 29
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆధ్వర్యంలో వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారు:
మాజీ వైస్ ఎంపీపీ జూలపెల్లి గంగాధర్ రావు,ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి సింగారపు రమేష్, సీనియర్ నాయకులు జూలపెల్లి సురేందర్ రావు,జూలపెల్లి సోమేశ్వర్ రావు,మాజీ నీటి సంఘం అధ్యక్షులు కాంటెం సుధాకర్, మైనార్టీ మండల నాయకురాలు షేక్ సుల్తానా,మాజీ నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు జిల్లా శ్రీనివాస్,మండల మాజీ మైనార్టీ అధ్యక్షులు ఎండి గౌస్ పాషా, మాజీ యూత్ వైస్ ప్రెసిడెంట్ చింతకుంట్ల రంజిత్,మాజీ వార్డు సభ్యులు చిరుకొండ వీరస్వామి,ముదిదేన దేవేందర్, కొలుగూరి సంతోష్ రావు, వడ్డేపల్లి వెంకటేశ్వర్లు,బొట్ల అనిల్ తదితరులు.ఈ సందర్భంగా ఎర్రబెల్లి, అరూరి మాట్లాడుతూ మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అరిగోస పడుతున్నారని,రేవంత్ రెడ్డి అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు.తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, మాజీ సొసైటీ చైర్మన్ ఎం.మనోజ్ గౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి,ఏఎంసీ మాజీ డైరెక్టర్లు బోయినపల్లి యుగంధర్ రావు,పుట్టపురం ఏకాంతం గౌడ్,మాజీ మండల అధ్యక్షులు రంగు కుమార్, మండల మాజీ రైతుబంధు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్,సీనియర్ నాయకులు చీమల బిక్షపతి,మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, సర్పంచులు ఏర్పుల శ్రీనివాస్,డెక్క సునీత కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
