నిధుల వినియోగంపై విచారణ జరపాలి:టీడీపీ ఇన్ చార్జి చాడ మరియ సురేఖ
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/అక్టోబర్ 29
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని అంబేద్కర్ నగర్ గ్రామ దళితవాడలో మహిళల కోసం నిర్మించాల్సిన మహిళా భవనం పిల్లర్ల దశలోనే నిలిచిపోయిందని టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి చాడ మరియ (సురేఖ) ఆరోపించారు.
గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, కేటాయించిన నిధులు,చేసిన ఖర్చులు,నిర్మాణ పురోగతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం సక్రమంగా వినియోగమైందా లేదా అనేది పారదర్శకంగా పరిశీలించి వాస్తవాలు వెల్లడించాలన్నారు.మహిళలకు ఉపయోగపడాల్సిన భవనం అసంపూర్తిగా ఉండటం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని, ముఖ్యంగా దళితవాడకు అందాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్,డీపీఓ వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి,నిర్మాణం నిలిచిపోవడానికి కారణాలు గుర్తించాలని కోరారు.బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.అధికారులు స్పందించకపోతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ప్రధాన డిమాండ్లు:మహిళా భవనం నిర్మాణం ఎందుకు ఆగిందో విచారణ జరపాలిగ్రామపంచాయతీ నిధుల లెక్కలు పరిశీలించాలి నిర్మాణ నాణ్యతపై క్షేత్రస్థాయి తనిఖీ చేయాలిబాధ్యులపై చర్యలు, అసంపూర్తి భవనాన్ని పూర్తి చేయాలి అని అన్నారు.
