సత్తుపల్లి/వేంసూరు,నవంబర్20(తెలుగుగళం) న్యూస్: నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల తహశీల్దార్ గా తక్కువ కాలంలో నిస్వార్థ సేవకుడిగా మండల ప్రజలలో మన్ననలు తెచ్చుకున్న జె.మాణిక్ రావు ఖమ్మం ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ అయ్యారు.మాణిక్ రావు కు నాయబ్ తహశీల్దార్ గూగులోత్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో గిరిధావర్ లక్ష్మణ్,సర్వేయర్, జూనియర్ సహాయకులు సాజిద్,ధరణి ఆపరేటర్ గురవయ్య, సబార్డినేట్ శారద,నూతనంగా విధులు చేపట్టిన తహశీల్దార్ సునీత లు శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.అయితే మాణిక్ రావు బదిలీ అవడం పై పలువురు ప్రజలు కన్నీరు పెట్టారు.సుపరిపాలన అందించే అధికారిని,తను పని చేస్తూ అందరితో పని చేయించే సేవకుడును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *