వర్ధన్నపేటఇల్లంద మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు,వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించేలా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని,కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరకు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు.ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.రైతుల సంక్షేమం, వారి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి,వైస్ చైర్మన్ శిబారాణి రాజేందర్, పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్,కల్లెడ పీఏసీఎస్ చైర్మన్ పిన్నింటి అనిల్ రావు,చౌటపల్లి పీఏసీఎస్ చైర్మన్ అత్తి కుమారస్వామి,పర్వతగిరి మండల అధ్యక్షురాలు సావిత్రి,వర్ధన్నపేట మండల మాజీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంద మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం



