వర్ధన్నపేట మండలంలోని బండౌతపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘాల వీవో భవనాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక,సామాజిక అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు.మహిళా సంఘాల సమావేశాలు, కార్యకలాపాల నిర్వహణకు నూతన భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.మహిళా సాధికారత,గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి,గ్రామ సర్పంచ్ బత్తిని దశరథం, గ్రామశాఖ అధ్యక్షుడు సినెపల్లి బాబు,మాజీ సర్పంచ్ అరుణ సాయి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు,గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బండౌతపురంలో నూతన వీవో భవనం ప్రారంభం



