నియోజకవర్గ పరిధిలోని వేంసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించి రూ.10 లక్షల విలువైన 82 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెందిన గొల్లపూడి శ్రీహరి (25)ను నిందితుడిగా గుర్తించి విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.అయితే నిందితుడు బాధితుడు సత్యనారాయణ పెద్దకొడుకు భార్య పిన్ని కొడుకు పంక్షన్ కు వచ్చి పని కానిచ్చేశాడు.
మండల పరిధిలోని పల్లెవాడ గ్రామానికి చెందిన యలమంచి సత్యనారాయణ కుటుంబం పాత ఇంట్లోని బీరువా అంతర్గత లాకర్లో బంగారు ఆభరణాలను భద్రపరిచింది. నవంబర్ 16న నూతన గృహప్రవేశం నిర్వహించగా, 17వ తేదీన పాత ఇంట్లోని బీరువా లాకర్‌ను పరిశీలించిన సమయంలో చోరీ జరగలేదని గుర్తించారు. అయితే అదే రోజు సాయంత్రం లాకర్‌ను పరిశీలించగా పగులగొట్టి ఉండటంతో పాటు అందులో భద్రపరిచిన 82 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. దీంతో బాధితులు నవంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు ఏసీపీ సాంబరాజు ఆదేశాల మేరకు, సీఐ పి. సర్వయ్య పర్యవేక్షణలో ఎస్సై పల్లెల ప్రదీప్ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టింది. వేలిముద్రలు, సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించి విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో 82 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు పల్సర్ ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
చోరీ కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ పి. సర్వయ్య, ఎస్సై పల్లెల ప్రదీప్, ఏఎస్సై నాగేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుల్ నాగేంద్రబాబు, కానిస్టేబుల్ ఎబినేజర్లను ఖమ్మం పోలీస్ కమిషనర్ అభినందించినట్లు సత్తుపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
బంగారు ఆభరణాల చోరీ కేసును ఛేదించిన వేంసూరు పోలీసులు



