ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన విద్యార్థిఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన విద్యార్థి

ఖమ్మం నగరంలోని ఉర్దుగర్ షాధీఖాన లో ఆదివారం స్టార్ డ్రాగన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్‌–2026లో సత్తుపల్లి నారాయణ పాఠశాలకు చెందిన విద్యార్థి మట్టా స్వామి గౌడ్ తన కరాటే ప్రతిభతో సత్తా చాటి పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం రాంకీ, ఆర్‌ఐ క్రాంతి విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించి, అతని కృషి, పట్టుదల, క్రీడల పట్ల ఆసక్తిని ప్రశంసించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్మూర్తి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయ బృందం స్వామి గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపింది. విద్యార్థి విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించింది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *