శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర నేటి నుండి ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఘనపూర్ సీఐ కరుణాకర్ రావు మాట్లాడుతూ.. 12 మంది ఎస్ఐలు,సుమారు 170 మంది పోలీస్ సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని,శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో జాతర జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు.
బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు



