మహిళల భద్రతతో పాటు 18 ఏళ్లలోపు బాలికల హక్కుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు రాధాభాయి సూచించారు.సోమవారం భూపాలపల్లిలోని జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ కార్యాలయం,సఖి,భరోసా కేంద్రాలను ఆమె సందర్శించి,వివిధ విభాగాల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బాల్యవివాహాలు,బాల కార్మికత్వం,లైంగిక వేధింపులను అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఆపదలో ఉన్న మహిళలు,బాలికలకు సఖి,భరోసా కేంద్రాల ద్వారా సత్వర న్యాయం,కౌన్సెలింగ్,వైద్య,వసతి సౌకర్యాలు అందించి వారికి భరోసా కల్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి జి.మల్లేశ్వరి,మహాదేవపూర్ సీడీపీఓ రాధిక,డీసీపీయూ,చైల్డ్ హెల్ప్ లైన్,సఖి,భరోసా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలు,పిల్లల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి



