మర్రిచెట్టు శివాలయంలో భక్తుల సందడి
శివుడికి విశేష అభిషేకాలు..365 వత్తులతో దీపారాధన
స్టేషన్ ఘనపూర్ నవంబర్ 24(E69NEWS -తెలుగు గళం న్యూస్)

కార్తీక పౌర్ణమి సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని మర్రిచెట్టు శివాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శివలింగానికి పూజారులు రామలింగ శర్మ, ప్రవీణ్ శర్మ, శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.అనంతరం 365 వత్తులతో దీపారాధన చేసి స్వామివారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది.కార్తీక మాసం శివారాధనకు ఎంతో విశిష్టమైనదని, ఈ మాసమంతా భక్తులు తమ ఇళ్లలో దీపాలు వెలిగిస్తూ, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు పేర్కొన్నారు.ఈ పూజా కార్యక్రమాల్లో ఘనపూర్ మున్సిపల్ కమిషనర్ బండ్ల రాధాకృష్ణ, అరుణకుమారి దంపతులు, కొలిపాక సునీత–సతీష్ దంపతులు, గట్టు సుకన్య–రంజిత్, గట్టు రజిత, కుమారస్వామి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శివనామస్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

