కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
కార్తీక పౌర్ణమి ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం గ్రామంలో శ్రీభవాని రామలింగేశ్వర స్వామి సన్నిధానంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,శ్రీనివాస్ అయ్యగారు అభిషేక,పూజ కార్యక్రమాలు నిర్వహించారు,ఈ సందర్భంగా శివాలయంలో రాంపురం గ్రామ ఉద్యోగస్తులు,దాతలచె నూతనంగా ఏర్పాటు చేసిన స్టేయిన్ లెస్ స్టీల్ గ్రిల్స్ ని స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ చేతులమీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పవిత్ర మాసంలో శివారాధన,దీపారాధనలతో ప్రతి ఇంటా భక్తి జ్యోతులు వెలగాలని,ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు,కార్తీక దీపాల వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు,ఆనందాలు నింపాలని,ఆ పరమశివుని కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి జిల్లా నాయకులు పెండ్లి రఘువీరారెడ్డి,ఎల్ది రమేష్ గౌడ్,రాంపల్లి వీరంజిగౌడ్, రామ సాయం విష్ణువర్ధన్ రెడ్డి,రాంపెల్లి వెంకన్న గౌడ్,రామసహాయం అశోక్ రెడ్డి,వంగ వెంకన్న,ఇరగని రమేష్,రాంపెల్లి రంజిత్,ఆదిమూల యాకయ్య, గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


