అభివృద్ధికి మరో ముందడుగు.. పలు పనులకు శంకుస్థాపన!అభివృద్ధికి మరో ముందడుగు.. పలు పనులకు శంకుస్థాపన!

ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు వేగం పెంచుతూ 13వ, 15వ వార్డుల్లో చేపట్టనున్న పలు పనులకు సర్పంచ్ కాకులమర్రి శ్రీలత శంకుస్థాపన చేశారు. 15వ వార్డులో హనుమాన్ ఆలయం సమీపంలో, పోలీస్ స్టేషన్ ముందు డ్రైనేజీపై సిమెంట్ స్లాబుల ఏర్పాటుకు, 13వ వార్డులో కల్వర్టు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ ఏటూరునాగారం గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వార్డుల్లోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్, ఉపసర్పంచ్ పర్వతల ఎల్లయ్య, వార్డు సభ్యులు గండేపల్లి నాగరాజు, వంగాల వీరన్న, మధు, బాలకృష్ణ, కొండాయి చిన్ని, ఆవుల లక్ష్మీనారాయణ, ఏంపెల్లి రాజు, ఎస్.కె. బాబా తదితర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *