మరిపెద పద్మశాలి సేవా సంఘం నూతన కమిటీ ఎన్నికమరిపెద పద్మశాలి సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక

మరిపెడ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడిగా కోమటి రమేష్.

ప్రధాన కార్యదర్శిగా దేవరశెట్టి శ్రీశైలం లు సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికున్నారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం నిర్వహించారు.సంఘం సభ్యుల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కోమటి రమేష్,ప్రధాన కార్యదర్శిగా దేవరశెట్టి శ్రీశైలం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా పొట్టబత్తిన రమేష్,వెళ్లే నరసయ్య,కోశాధికారిగా పెండెం యాకయ్య ఎన్నికయ్యారు.సంఘం సభ్యులందరూ సమష్టిగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో నాయకులపై తమకున్న నమ్మకాన్ని చాటుకున్నారు.

సంఘం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా:అధ్యక్షుడు కోమటి రమేష్..

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కోమటి రమేష్ మాట్లాడుతూ..తనపై నమ్మకంతో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సంఘం సభ్యులకు,కులబాంధవులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు అప్పగించిన బాధ్యతను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తానని,ప్రతి ఒక్కరినీ కలుపుకొని సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.పద్మశాలి సమాజంలో ఐక్యత,సోదరభావం పెంపొందించడంతో పాటు సమాజంలోని ప్రతి కుటుంబానికి సంఘం అండగా నిలిచేలా కృషి చేస్తానన్నారు.ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం,విద్యార్థులను ప్రోత్సహించడం,యువతను సంఘం కార్యక్రమాల్లో భాగ స్వాములను చేయడం,సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం తన ప్రాధాన్యతలుగా ఉంటాయని తెలిపారు.సంఘం సభ్యుల సలహాలు,సూచనలతో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని అధ్యక్షుడు కోమటి రమేష్ వెల్లడించారు.

సమాజ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం:ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి శ్రీశైలం..

అనంతరం ప్రధాన కార్యదర్శి శ్రీశైలం మాట్లాడుతూ..పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.సంఘం ఆశయాలు,లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ పద్మశాలి సమాజ అభ్యున్నతికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.సంఘం కార్యకలాపాలను మరింత బలోపేతం చేసి,కులబాంధవులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు.సమాజంలోని సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు,పేద కుటుంబాలకు అండగా నిలవడం,విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం,యువతలో సేవాభావాన్ని పెంపొందించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.సంఘం సభ్యుల సహకారం,పెద్దల ఆశీస్సులతో పద్మశాలి సేవా సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని,అలాగే అనుభవం ఉన్న కుల పెద్దల సలహాలు సూచనలతో సంగాన్ని మరింత భలోపేతం చేస్తామాను ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి శ్రీశైలం అన్నారు.నూతన కార్యవర్గం పద్మశాలి సమాజ ఐక్యతకు,అభ్యున్నతికి కృషి చేయాలని సంఘం సభ్యులు,కులబాంధవులు ఆకాంక్షించారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కోమటి రమేష్,ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి శ్రీశైలం,ఇతర కార్యవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *