అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఅంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించే మహోన్నత గ్రంథమని, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. *భారత 77వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేంసూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ వద్ద అంబేద్కర్ నగర్ యూత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేంసూరు గ్రామ సర్పంచ్ ఎండీ ఫకృద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

*
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ముఖ్య అతిథి, నాయకులు , ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరిస్తూ మాట్లాడుతూ, 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక రోజును ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కృషి, దూరదృష్టి వల్ల దేశంలోని అణగారిన వర్గాలకు హక్కులు, గౌరవం, సమాన అవకాశాల కోసం బలమైన పునాది ఏర్పడిందని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకోవడమే కాకుండా, వాటిని ఆచరణలో పెట్టేందుకు యువత ముందుండాలని, రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో: అంబేద్కర్ యూత్ అధ్యక్షులు వేల్పుల నవకుమార్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెల్లి నరసింహాస్వామి, కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలు పిల్లి రమణ, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఎండీ అక్బర్, మాజీ ఎంపీపీ నీలం బాబురావు, లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ ఇబ్రహీం, రిటైర్డ్ ఎస్ఐ గరపాటి మ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *