గుంతకల్లు నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరామ్,ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి తో కలిసి గుంతకల్లు పట్టణం డీఆర్ఎమ్ ఆఫీస్ నందు సమావేశానికి హాజరయ్యారు. ఈసందర్బంగా గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ ఎస్సార్సీ సౌత్ సెంట్రల్ రైల్వే నందు ఒక సభ్యుడి గా నేను ఎంపిక అవడం చాలా సంతోషమని నన్ను ఎంపిక చేసిన పెద్దాయన చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎస్సార్సీ కమిటీ లో 18మంది సభ్యులు ఉంటారని గుంతకల్లు పట్టణం లో ఉన్న రైల్వే సంబంధిత అంశాలు హనుమాన్ సర్కిల్ ఓవర్ బ్రిడ్జి మరియు కసాపురం రోడ్డునందు గల బ్రిడ్జి ఎత్తు అలాగే ప్రయాణికుల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని అని ఈ కమిటీ మీటింగ్ లో చర్చించడం జరిగిందని గుమ్మనూరు జయరామ్ తెలిపారు. పట్టణం లోని ప్రజా శ్రేయస్సు కొరకు కలిసి పని చేసి ప్రజల నుండి ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటామని తెలిపారు.