
564 మార్కులతో మండల టాపర్గా నిలిచిన గాదె శ్రీజ
ఈ69 న్యూస్ జఫర్ఘడ్ ఏప్రిల్ 29
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి (జి) ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు.మొత్తం 16 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాన్ని సాధించారు అని ప్రధానోపాధ్యాయులు సీతారామయ్య తెలిపారు.వారిలో 8 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. గాదె శ్రీజ 564 మార్కులతో మండల టాపర్గా నిలిచింది.దామెర దీక్ష 552 మార్కులు, గాదరి అరవింద్ వర్మ 537 మార్కులు సాధించారు.గ్రామానికి చెందిన విద్యార్థులు అందరూ ఉత్తమ ఫలితాలు సాధించడం గ్రామానికి గర్వకారణంగా మారింది.విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల మార్గదర్శకత ఫలితంగా ఈ విజయాన్ని సాధించినట్లు పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.