కొండ నాలుకకి మందు వేస్తే ఉన్నా నాలుక పోయింది
తెలుగు గళం న్యూస్ నర్సంపేట ఏప్రిల్ // 29
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మెడికల్ కాలేజీ కి మరియు ఆస్పత్రిని 100 ల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామని చెప్పుకునే ప్రభుత్వాలు చెప్పుకోవడానికే “కొండ నాలుకకి మందు వేస్తే ఉన్నా నాలుక పోయింది అన్నట్లు ఉంది. రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో త్రాగడానికి త్రాగు నీరు లేని పరిస్థితి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వైఫల్యం ఈ రోజు నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క కాటుకు గురై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో అక్కడ చికిత్స పొందుతున్న వారు ఇక్కడ త్రాగడానికి కనీసం బుక్కడు మంచి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరిగింది..అక్కడ ఉన్న సూపర్డెంట్ మరియు ఆర్ ఎం ఓ తో అక్కడ ఉన్నా రోగులు పడుతున్నా ఇబ్బందులను చెప్పి ,వెంటనే సంబంధిత అధికారులు దృష్టి పెట్టి అక్కడ మంచి నీటి ఏర్పాటు చెయ్యకపోతే మేమే స్వయంగా ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు.