E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ7 May, 2026E69NEWS

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు-ట్రాఫిక్ సీఐ కోడూరి సుజాత

వరంగల్ పోచమ్మమైదాన్ జంక్షన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ఈ69 న్యూస్ వరంగల్ మే07

వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్ జంక్షన్‌లో గురువారం రోజు ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించారు. ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు బృందాలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ కోడూరి సుజాత మాట్లాడుతూ యువతతో పాటు అన్ని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రాణాలతో చెలగాటమాడినట్లేనని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రమాద రహిత నగరమే లక్ష్యంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు ఇకముందు కూడా నిరంతరం కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *