E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ7 May, 2026E69NEWS

ఏసీబీ వలలో అటవీ శాఖ పెద్ద తలలు

రూ.3.5 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భద్రాచలం ఎఫ్‌డీఓ, డీఆర్‌ఓ

ఈ69న్యూస్ బ్యూరో రిపోర్టర్ (ముహమ్మద్ సలీం)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖలో భారీ అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. భద్రాచలం అటవీ శాఖ ఎఫ్‌డీఓ సుజాత, చర్ల ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ కృష్ణయ్య ఏసీబీ వలలో చిక్కారు.చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల సమయంలో కొన్ని చెట్లు దెబ్బతినడంతో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎఫ్‌డీఓ సుజాత రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం భద్రాచలం కార్యాలయంలో రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఘటనతో అటవీ శాఖలో అవినీతి వ్యవహారాలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన గుర్తు చేస్తున్నారు.అటవీ శాఖలో అవినీతి పేరుకుపోయిందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *